Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కారు డ్రైవర్‌పై దాడి.. వీడియో ఇదిగో!

Raveena Tandon and her driver assaulted by crowd in Bandra
Advertisement
  • రవీనా కారు తన తల్లికి తగిలిందంటూ డ్రైవర్‌తో ఓ వ్యక్తి గొడవ
  • రవీనా కారు దిగి వద్దని వారిస్తున్నా దాడిచేసిన గుంపు
  • అసలు కారు ఢీకొట్టనే లేదన్న పోలీసులు
  • సీసీటీవీలో రికార్డైన ఘటన
Advertisement
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కారు తన తల్లిని ఢీకొట్టిందంటూ ఓ వ్యక్తి రవీనా డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. అతడికి మరికొందరు జతకలవడంతో గొడవ మరింత పెద్దది అయింది. స్థానికులు రవీనా డ్రైవర్‌పై దాడిచేయడమే కాకుండా రవీనాను కూడా తోసిపడేశారు. ఆమెపైనా దాడికి యత్నించారు. గొడవ జరుగుతుండడంతో కారు దిగిన రవీనా వారిస్తున్నప్పటికీ వినకుండా అందరూ కలిసి మూకుమ్మడిగా డ్రైవర్‌పై దాడికి యత్నించారు. వద్దువద్దని రవీనా మొత్తుకుంటున్నా వినకుండా ఆమెపైకీ దూసుకెళ్లారు. ఆమెను చెయ్యిపట్టి లాగడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై తాజాగా ముంబై పోలీసులు స్పందించారు. రవీనా కారు ఎవరినీ ఢీకొట్టనే లేదని తమ దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో కారు ఆ మహిళ సమీపం నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, సోదరితో కలిసి రవీనా ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు తగిలిందంటూ తొలుత డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగిన మహిళ కుమారుడు.. ఆపై స్థానికులతో కలిసి దాడిచేశాడు. ఈ క్రమంలో రవీనాపైనా దాడి జరిగింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
 
గొడవ జరగడంతో మాట్లాడేందుకు కారు దిగిన రవీనా ‘దయచేసి నన్ను కొట్టొద్దు’ అని చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అయినప్పటికీ వినిపించుకోని స్థానికులు ఆమెను చెయ్యిపట్టి లాగి దాడిచేశారు. గుంపులోని ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ.. రవీనా డ్రైవర్ ఆమె తల్లిని ఢీకొట్టాడని, ప్రశ్నిస్తే దాడిచేశాడని చెప్పడం వినిపించింది. అంతేకాదు, ‘మారో.. మారో’ అని రెచ్చగొట్టాడు. ఆ సమయంలో రవీనా తాగి ఉందని, కారు దిగి మహిళపై దాడి చేసిందని ఆరోపించాడు. కారు ఢీకొట్టిందని చెబుతున్న మహిళ మాత్రం.. రవీనా, ఆమె డ్రైవర్ తనపై దాడిచేశారని, ముక్కు నుంచి రక్తం కారుతోందని చెప్పింది.

ఈ ఘటనపై డీసీపీ రాజ్‌ తిలక్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు తప్పుగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాము మొత్తం సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశామని, కారు ఢీకొట్టినట్టు ఎక్కడా లేదని తెలిపారు. డ్రైవర్ కారు రివర్స్ చేస్తుండగా అదే సమయంలో ఆ కుటుంబం రోడ్డు దాటుతోందని పేర్కొన్నారు. కారును ఆపిన కుటుంబం తమను ఢీకొట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగిందని వివరించారు. అలా గొడవ మొదలైందని తెలిపారు. ఈ తర్వాత రవీనా టాండన్, ఆరోపిత కుటుంబ సభ్యులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని, అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని కోరుతూ లెటర్లు ఇచ్చారని డీసీపీ వివరించారు.
Advertisement
Advertisement
Raveena Tandon
Bandra
Mumbai
Bollywood
Attack

More Telugu News